Ramappa temple: అద్భుతమైన హెరిటేజ్‌ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం: శ్రీనివాస్‌గౌడ్‌ - telugu-news-minister srinivas goud review on ramappa temple
close
Published : 30/07/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ramappa temple: అద్భుతమైన హెరిటేజ్‌ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితంగానే రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించిన నేపథ్యంలో దేవాలయం పరిసర ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై  పురావస్తు శాఖ, సర్వే ఆఫ్‌ ఇండియా, హెరిటేజ్‌ ఆఫ్‌ తెలంగాణ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం, రాష్ట్రం పరిధిలో ఉండే అంశాలపై సమావేశంలో చర్చించారు. 

శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అద్భుతమైన హెరిటేజ్‌ ప్రదేశంగా రామప్ప గుడిని తీర్చిదిద్దుతామన్నారు. ఒక్క రామప్ప గుడిని మాత్రమే కాకుండా వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, కాకతీయుల నాటి దేవాలయాలను గుర్తించి వాటినీ అభివృద్ధి చేస్తామన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు రామప్ప గుడితో పాటు ఇతర దేవాలయాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అధికారులతో కలిసి రామప్ప గుడిని సందర్శించి గుడి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందజేయనున్నట్లు వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని