హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ అందక ముగ్గురి మృతి - three died in hyderabad lack of oxygen
close
Published : 10/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ అందక ముగ్గురి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావాల్సి ఉంది. చిరునామా తెలియకపోవడంతో  ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దీనిపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు  చేయగా.. పోలీసుల సహకారంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరింది. అయితే అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని