Top Ten News @ 1 PM - top ten news at 1 pm
close
Updated : 02/06/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. Pfizer: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!

భారత్‌లో టీకాల కొరతను అధిగమించేదుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియల్లో డీసీజీఐ మార్పులు చేసింది. విదేశాల్లో ఆమోదించిన టీకాలకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని తెలిపింది. కొన్ని దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన కొవిడ్‌19 టీకాలు భారత్‌లో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Delta Variant: డెల్టా వేరియంట్‌పై ఆందోళన..!

భారత్‌లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా(బి.1.617) వేరియంట్‌ మొత్తంలో ఒక స్ట్రెయిన్‌ అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రకం వేరియంట్‌ వైరస్‌ మళ్లీ మూడు స్ట్రెయిన్లుగా మారిందని.. వాటిల్లో కూడా బి.1.617.2 రకం మాత్రం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని వెల్లడించింది. గత నెల బి.1.617ను ‘ఆందోళనకర వేరియంట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Vaccine: కరోనా విజేతలు ఒక్క డోసు తీసుకున్నా..

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి టీకాతో అదనపు బలం లభిస్తుందని తాజాగా మరో పరిశోధన తేల్చింది. వీరికి కరోనా వైరస్‌లో కొత్తగా వస్తున్న రకాల నుంచి కూడా రక్షణ ఉంటుందని వెల్లడించింది. అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు కొవిడ్‌ బాధితుల్లో యాంటీబాడీల ఉనికిని విశ్లేషించారు. ఆ తర్వాత కూడా వాటి తీరు తెన్నులను గమనించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 92.48 శాతానికి చేరిన రికవరీ రేటు

4. TS News: ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్దకు సీఎం వెళ్లి నివాళులర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. CBN: నా గుండె బరువెక్కింది: చంద్రబాబు

మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్రనాథ్‌ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. రవీంద్ర మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకుని పుత్రశోకంతో ఉన్న మాగంటి దంపతులు.. ఇప్పుడు మరో కుమారుడిని కోల్పోవడం చూసి బాధతో తన గుండె బరువెక్కిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: విద్యార్థుల్ని బలిచేయొద్దు: లోకేశ్‌

6. AP News: పీలేరు జైలుకు జ‌డ్జి రామ‌కృష్ణ త‌ర‌లింపు

జ‌డ్జి రామ‌కృష్ణ‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి ఈ ఉదయం పీలేరు స‌బ్‌ జైలుకు త‌ర‌లించారు. త‌న తండ్రికి ప్రాణ‌హాని ఉందంటూ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎ.కె. గోస్వామికి రామ‌కృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. రామ‌కృష్ణ ఉన్న బ్యార‌క్‌కు వ‌చ్చిన మ‌రో ఖైదీ ఆయ‌న‌ను బెదిరించార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. బెదిరించిన వ్య‌క్తి వ‌ద్ద క‌త్తి కూడా దొరికింద‌ని అందులో వివ‌రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ICMR : లాక్‌డౌన్ల తొలగింపులపై తొందర వద్దు..!

లాక్‌డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది.  కరోనా థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల ప్రణాళికను సూచించారు.  తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు , కొవిడ్‌ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘RRR’: ఆ సీన్‌ చూస్తుంటే కన్నీళ్లాగలేదు!

ఆయన కలం కదిపితే చాలు కలెక్షన్ల కోటలు బద్దలయ్యే కథలు పుడతాయి.. ఆయన కథనాన్ని రచిస్తే చూస్తున్న ప్రేక్షకుల హోరుతో థియేటర్లు దద్దరిల్లుతాయి.. తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన ఎన్నో కథల సృష్టికర్త.. భరతజాతి గర్వించే దర్శకుడిని కన్న మహా రచయిత.. ఆయనే కె.వి.విజయేంద్రప్రసాద్‌. ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Family man: రక్తి కట్టించిన పాత్రలివే!

9. TS News: భాజపా మద్దతుతోనే తెలంగాణ: సంజ‌య్‌

భాజ‌పా మ‌ద్ద‌తుతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైనట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు ల‌క్ష్యాలు నెర‌వేరడం లేద‌ని ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం వేళ ఆ రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించిన అనంత‌రం సంజయ్‌ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఎందుకు వ‌చ్చింద‌ని బాధ‌ప‌డే ప‌రిస్థితిని తెరాస క‌ల్పించింద‌ని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Dhoni: ధోనీ కోసం దాదాను ఒప్పించాల్సి వచ్చింది

దులీప్‌ ట్రోఫీ-2003-04 ఫైనల్లో ఈస్ట్‌జోన్‌ తరఫున ఎంఎస్‌ ధోనీతో వికెట్‌ కీపింగ్‌ చేయించేందుకు సౌరవ్‌ గంగూలీని ఒప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ మాజీ ప్రధాన సెలక్టర్‌ కిరణ్‌ మోరె అన్నారు. దీప్‌దాస్‌ గుప్తా వికెట్‌ కీపింగ్‌ చేయకుండా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఫైనల్లో ఆకట్టుకున్న మహీ ఆ తర్వాత భారత్‌-ఏ తరఫున పరుగుల వరద పారించాడని తెలిపారు. ఆపై టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాక ఏం జరిగిందో అందరికీ తెలిసిన కథే అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

WTC Finals: కుర్రాళ్లు మానసికంగా సిద్ధమయ్యారుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని