82 దేశాల్లో విస్తరించిన కొత్తరకం వైరస్‌! - uk variant has mutated again
close
Published : 03/02/2021 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

82 దేశాల్లో విస్తరించిన కొత్తరకం వైరస్‌!

బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లలో గుర్తించిన శాస్త్రవేత్తలు

లండన్‌: బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్‌ ఇప్పటికే 82 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ కూడా దాదాపు 40దేశాల్లో విస్తరించగా, బ్రెజిల్‌ రకం తొమ్మిది దేశాలకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వ్యాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. అమెరికాలో మొత్తం 471 కొత్తరకం కేసులు బయటపడగా, వీటిలో 467 కేసులు బ్రిటన్‌ రకం, మూడు కేసులు దక్షిణాఫ్రికా రకం, మరోకేసు బ్రెజిల్‌ రకం వైరస్‌ నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లోనూ బ్రిటన్‌ రకం వైరస్‌ కేసుల సంఖ్య 150దాటాయి.

మళ్లీ రూపుమార్చిన కొత్తరకం వైరస్‌!

బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోందన్న విషయం తెలిసిందే. సాధారణ రకం కంటే దాదాపు 40శాతం వేగంతో వ్యాప్తిచెందడమే కాకుండా బ్రిటన్‌లో కొవిడ్‌ మరణాలు పెరగడానికి ఈ రకం కారణంగా భావిస్తున్నారు. ఈ సమయంలో కొత్త రకం వైరస్‌ మరోసారి రూపుమార్చుకున్నట్లు (మ్యుటేషన్‌) తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్‌ దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్‌లో తాజాగా మ్యుటేషన్‌ చెందిన రకాన్ని గుర్తించినట్లు ఇంగ్లాండ్‌ ఆరోగ్యశాఖ నిపుణులు పేర్కొన్నారు. E484Kగా పిలిచే ఈరకం వైరస్‌ బ్రిటన్‌లో వ్యాపిస్తోన్న కేసులన్నింటిలో లేదని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 2లక్షల నమూనాలను విశ్లేషించగా 11కేసుల్లో మ్యుటేషన్‌ చెందని రకాన్ని గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఇది ఊహించదగిన విషయమేన్న అధికారులు, ఇలాంటి మ్యుటేషన్‌లు జరగడం సాధారణమే అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే,‌ బ్రిటన్‌లో వెలుగుచూసిన వైరస్‌ తొలుత కెంట్‌లో బయటపడింది. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వైరస్‌ రకాలపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా? అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇవీ చదవండి..

దక్షిణాఫ్రికా రకంపై వ్యాక్సిన్‌ పనిచేయదేమో!
కొత్తరకంపై ‘కొవాగ్జిన్‌’ పనిచేస్తుంది..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని