white fungus: ఒక సాధారణ ఫంగల్‌ ఇన్పెక్షన్‌ - white fungus just a normal fungal infection black fungus more dangerous doctors
close
Published : 22/05/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

white fungus: ఒక సాధారణ ఫంగల్‌ ఇన్పెక్షన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వేళ బ్లాక్‌ ఫంగస్‌ భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా వైట్‌ ఫంగస్ ఇన్ఫెక్షన్‌ వెలుగులోకి వచ్చింది. బిహార్‌లోని పట్నా వైద్య కళాశాలలో నాలుగు వైట్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి. అయితే ఈ వైట్‌ ఫంగస్‌ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, బ్లాక్‌ ఫంగస్‌ వల్లే ఎక్కువ ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు. వైట్‌ ఫంగస్‌ సాధారణ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ అని స్పష్టంచేశారు.  కాన్డిడియాసిస్‌ ఇన్ఫెక్షన్‌ సర్వసాధారణమైన ఓరల్‌ థ్రష్‌ అని తెలిపారు. వైట్‌ ఫంగస్ గురించి ఆందోళ చెందవద్దని, ఇది కాన్డిడియాసిస్‌, కాండిడా అనే రకమైన ఫంగస్‌ వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ అని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ ఈశ్వర్‌ గిలాడా తెలిపారు. వైట్‌ ఫంగస్‌ ప్రమాదరకమని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లకు, కొవిడ్‌-19 చికిత్సలో స్టెరాయిడ్స్‌ అధికంగా తీసుకున్నా వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుందని వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్‌ గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, ప్రైవేటు భాగాలు, నోరు భాగాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని