డీగ్లామర్ రోల్లోనూ మెప్పించిన సామ్
హైదరాబాద్: అప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో రాణించిన సమంత మొదటిసారి డీగ్లామర్ రోల్లో నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో సామ్.. రామలక్ష్మి అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. 2018లో విడుదలైన ఈ సినిమా సామ్ కెరీర్లో ఓ ఆణిముత్యంగా నిలిచింది. అయితే ‘రామలక్ష్మి’ పాత్ర కోసం సమంతను తీసుకోవాలని చిత్రబృందం తొలుత భావించలేదట. సామ్‌ని డీగ్లామర్‌గా చూపిస్తే అభిమానులు ఏమంటారో అని చిత్రబృందంలోని కొంతమంది సభ్యులు అనుమానం వ్యక్తం చేశారట.
‘‘రామలక్ష్మి పాత్ర నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. డీగ్లామర్ పాత్రలో నేను నటిస్తే ప్రేక్షకులు ఓకే చేస్తారా? అనే అనుమానం చాలామందికి వచ్చింది. ‘ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లో కనిపించిన సమంతను ఓ పల్లెటూరు అమ్మాయిగా, మొరటుగా.. పూర్తి డీగ్లామర్ రోల్లో చూపిస్తే అభిమానులు ఏమనుకుంటారో’ అని సుకుమార్ డైరెక్షన్ టీమ్‌లోని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, సుకుమార్ సర్ మాత్రం నాపై నమ్మకం ఉంచి ‘రంగస్థలం’లో నాకు అవకాశమిచ్చారు. అలా నాకు రామలక్ష్మి పాత్ర చేసే అవకాశం వరించింది’’ అని ఇటీవల సమంత వెల్లడించారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ