వారితో స్నేహం.. మీ జీవితమే మారిపోతుంది: పూరి - OLDER FRIENDS | Puri Musings by Puri Jagannadh
close
Published : 11/12/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారితో స్నేహం.. మీ జీవితమే మారిపోతుంది: పూరి

హైదరాబాద్‌: ‘చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలతో గడపటం అనేది ఒక అద్భుతం. వాళ్లు ఆటలు, చిన్న చిన్న కథలు, మంచి, చెడూ పండగలు ఇలా ఎన్నో నేర్పుతారు’ అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘ఓల్డర్ ఫ్రెండ్స్‌’ అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘అమ్మానాన్నల కంటే తాతయ్యతో స్నేహం బాగుంటుంది. అయితే పెరిగేకొద్దీ మనకి తెలియకుండానే వాళ్లకి దూరమైపోతాం. చాలా మిస్సవుతాం. మన జీవితంలో పెద్దవాళ్లతో స్నేహం చాలా అవసరం. పది, ఇరవై ఏళ్ల వయసు తేడా ఉన్న స్నేహితులు మనకు కావాలి. కొన్ని జీవితానుభవాలు మీరు తెలుసుకోకుండానే అర్థమవుతాయి. స్నేహ బంధంలో వయసు తేడా అనేది అవసరం లేని విషయం. నిజానికి అదే మంచి జోడి అవుతుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ మనకు కిటికీ లాంటి వాళ్లు. వాళ్ల పక్కన ఉంటే మన భవిష్యత్‌ను మనం చూసుకోవచ్చు. జీవితంలో వాళ్లు చూసిన సన్నివేశాలే మనమూ చూస్తాం. వాళ్లు విన్న డైలాగులే మనమూ వింటాం. మనకేమీ కొత్తగా జరగవు. ఆ సన్నివేశాలేంటో కొంచెం తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం. పెద్దవాళ్లు మనకంటే ఎన్నో తప్పులు చేసుంటారు. నువ్వు చేయబోయేవి కూడా వాళ్లు చూసేసుంటారు. ఆ తప్పుల నుంచి మనం ఎన్నో తెలుసుకోవచ్చు. మీకున్న అపరిపక్వత, అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే చాలా అనర్థాలను లెక్క చేయరు’’

‘‘పెద్దవాళ్లెప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్లతో ఉంటే ఆ ప్రశాంతత మీకు అలవాటవుతుంది. ప్రతిదాన్ని వేరే కోణంలో నుంచి చూస్తారు. మీకు ఒక సీనియర్ మిత్రుడు ఉంటే మీలో కోపాలు తగ్గుతాయి. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించటం మొదలుపెడతారు. జీవితంలో ఏది ముఖ్యమో అర్థమవుతుంది. ‘మేము యువత కదా.. మనకి సీనియర్స్’ ఎందుకులే? అని అనుకోవద్దు.. వంద యుద్ధాలు చూసిన సింహాలు వాళ్లు. పక్క టేబుల్‌లో ఉంటే వెళ్లి పలకరించండి. స్నేహం చేసుకోండి. వాళ్లతో ఉంటే సంగీతం, కవిత్వం అర్థమవుతాయి. లేకపోతే యూకే టాప్‌ 10 అంటూ పబ్‌లో డ్యాన్స్ చేయటం తప్ప మీకేమీ రావు. పబ్‌లో అమ్మాయి నంబర్‌ తీసుకునే గొడవలో మీరుంటారు. అలా నంబర్‌ తీసుకుంటే ఎంత సరదా తీరిపోతుందో మీ సీనియర్‌ స్నేహితుడు చెప్తాడు. వయసు తేడా ఉన్న స్నేహబంధం మీకు అలవాటైతే మీరు ఏ వయో వ్యత్యాసం ఉన్న గ్రూపులోనైనా స్థిరపడిపోతారు. మీ జీవితం మారకపోతే నన్ను అడగండి. ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చోవడం ఎప్పుడూ చాలా మంచిది. వారానికి ఒకసారైనా కూర్చోండి’’ అని పూరీ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని