KatrinaKaif: పెళ్లికి రండి.. కానీ, వాటిని తీసుకురాకండి..! - telugu news katrina kaif and vicky kaushal wedding photos very unlikely to get leaked
close
Updated : 26/11/2021 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KatrinaKaif: పెళ్లికి రండి.. కానీ, వాటిని తీసుకురాకండి..!

ముంబయి: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ కత్రినాకైఫ్‌, విక్కీకౌశల్‌ మరి కొన్నిరోజుల్లో దంపతులు కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ ఆరంభంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇరువురు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకూ జరగనున్న వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేదిక కానుందట. తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజుని కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట.

అందుకే ఫ్రెండ్స్‌కి మాత్రమే వెడ్డింగ్‌ కార్డులు అందించారట. అంతేకాకుండా, పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం తమకు ఇష్టం లేదని.. అందుచేత పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని వారు కోరినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తోన్న ఆర్గనైజర్స్‌కి సైతం ఈ విషయంపై రూల్‌ పాస్‌ చేశారట. మరోవైపు, శుభకార్యం దగ్గరపడుతోన్న తరుణంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ జంట గత కొన్నిరోజుల నుంచి పెళ్లి పనుల్లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారట. పెళ్లి దుస్తులు, ఆభరణాల సెలక్షన్‌, అతిథుల కోసం ఇచ్చే విందు... ఇలా అన్ని విషయాలు దగ్గరుండి గమనిస్తున్నారని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని