Crime News: బైక్‌పై వెళ్తున్న జంటపై దుండగుల దాడి

తాజా వార్తలు

Published : 21/09/2021 01:32 IST

Crime News: బైక్‌పై వెళ్తున్న జంటపై దుండగుల దాడి

కుమురం భీం: బైక్‌పై వెళ్తున్న ఓ జంటపై దుండగులు దాడి చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబ వద్ద సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న జంటపై కడంబ వద్ద దుండగులు దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈక్రమంలో వారు దుండగుల నుంచి తప్పించుకునేందుకు గాయాలతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో బైక్‌ కనిపించడంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అటవీ ప్రాంతంలో జంటను గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని