close

తాజా వార్తలు

Updated : 03/03/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిరాక్స్‌ నోట్లు రూ.7.90 కోట్లు!

క్క మడత కూడా పడని కట్టల కొద్దీ నగదు గుట్టగా పేర్చారు ఏంటా..? అని చూస్తున్నారా! ఇవన్నీ నకిలీ నోట్లు. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా-ఆంధ్ర సరిహద్దు గ్రామమైన సుంకిలో ఓ కారును తనిఖీ చేసి వీటిని గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. నోట్లను ఠాణాకు తీసుకొచ్చి లెక్కిస్తే.. మొత్తం 1580 కట్టల రూ.500 నకిలీ నోట్లు రూ.7.90 కోట్లు ఉన్నట్లు తేల్చారు. రాయపూర్‌లో కలర్‌ జిరాక్స్‌ తీసి విశాఖపట్నం తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని సునాబెడ ఎస్డీపీఓ కార్యాలయంలో ఎస్పీ వరుణ్‌ గుంటపల్లి వెల్లడించారు. నిందితుల నుంచి రూ.35 వేల నగదు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకొని, మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. దొంగ నోట్ల వ్యవహారం వెనుక ఒక ముఠానే ఉందని ఎస్పీ తెలిపారు.

- న్యూస్‌టుడే, సిమిలిగుడ



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని