close

తాజా వార్తలు

Updated : 02/03/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కడపలో న్యాయవాది అనుమానాస్పద మృతి

కడప: జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ న్యాయవాది, కడప న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు పి.సుబ్రమణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సుబ్రమణ్యం రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఎంత సేపటికిఇంటికి రాకపోవడంతో చరవాణికి ఫోన్‌ చేయగా.. స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అనుమానం వచ్చి సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లారు.  అక్కడ అతని చెప్పులు కనిపించినా..మనిషి కనిపించకపోవడంతో సమీపంలో గాలించారు.

అపార్ట్‌మెంట్‌ కింద సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనేపోలీసులు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. హత్యా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనేది మిస్టరీగా మారింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని