ప్రాంక్‌ చేయబోయి.. ప్రాణాలు కోల్పోయాడు!
close

తాజా వార్తలు

Published : 08/02/2021 21:02 IST

ప్రాంక్‌ చేయబోయి.. ప్రాణాలు కోల్పోయాడు!

ఇంటర్నెట్‌ డెస్క్: సరదాగా అపరిచితులపై ప్రాంక్‌ చేయబోయి.. ఓ యూట్యూబర్‌ ప్రాణాలు కోల్పోయిన ఘటన యూఎస్‌లోని  నాష్‌విల్లె నగరంలో చోటుచేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల తిమోతి విల్క్స్‌ అతడి స్నేహితుడు కలిసి తమ యూట్యూబ్‌ ఛానల్‌ కోసం ‘దోపిడీ’ చేసే ఒక ప్రాంక్‌ వీడియో రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు వీరిద్దరు కలిసి అడ్వంచర్‌ పార్క్‌ వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రాంక్‌లో భాగంగా గత శనివారం పార్కింగ్‌ ప్రాంతంలో నిల్చున్న ఓ గుంపును కత్తి చూపించి దోపిడీకి యత్నించారు. అయితే, ఆ గుంపులో ఉన్న 23ఏళ్ల స్టార్న్స్‌ జూనియర్‌ అనే వ్యక్తి అది ప్రాంక్‌ అని తెలియక.. తన వద్ద ఉన్న తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తిమోతి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరిపారు. స్టార్న్స్‌ కేవలం ఆత్మరక్షణ కోసమే తిమోతిపై కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఈ కేసులో ఎవరిపై ఇంకా చర్యలు తీసుకోలేదని.. విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి..

చోరీ చేసిన కారులో డీజిల్‌ అయిపోవడంతో..

ప్రాణం తీసిన ఆమ్లెట్‌ తగాదా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని