UP: లైంగికంగా వేధించి..రెండోఅంతస్తు నుంచి తోసి..
close

తాజా వార్తలు

Published : 23/06/2021 16:23 IST

UP: లైంగికంగా వేధించి..రెండోఅంతస్తు నుంచి తోసి..

సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ దృశ్యాలు

మధుర: 17ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి..రెండంతస్తుల భవనంపై నుంచి కిందికి తోసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. ఆ ఘటనలో బాధితురాలి వెన్నెముక విరిగిపోయిందని వైద్యులు వెల్లడించారు. సోమవారం రాత్రి చాతా ప్రాంతంలో సీసీటీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాలికను రోడ్డుపైకి తోసి, నిందితులు పారిపోతున్న దృశ్యాలు వాటిలో రికార్డయ్యాయి. ఆ వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా..ఈ ఘటనలో ఆమె వెన్నెముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిలో ముగ్గురు నిందితుల పేర్లు వెల్లడించారు. వారు గత కొద్దినెలలుగా బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. 

‘ఆ ముగ్గురిలో ఒకవ్యక్తి సోమవారం రాత్రి నాకు ఫోన్ చేశాడు. నా కుమార్తెతో మాట్లాడించాలని బెదిరించాడు. కుదరదని చెప్పడంతో.. చాలా అసభ్యంగా నిందించాడు. ఆ వెంటనే ఆ ముగ్గురు మా ఇంట్లోకి దూసుకువచ్చి నా కుమార్తెను లైంగికంగా వేధించి, తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మేమంతా గట్టిగా అరిచి, అడ్డుకోవడంతో తనను రెండో అంతస్తు నుంచి కిందికి తోసేశారు’ అంటూ ఆ బాలిక తండ్రి వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని