Crime news: పట్టాభి ఇంటిపై దాడిచేసిన మరో ఏడుగురి గుర్తింపు

తాజా వార్తలు

Published : 25/10/2021 01:33 IST

Crime news: పట్టాభి ఇంటిపై దాడిచేసిన మరో ఏడుగురి గుర్తింపు

విజయవాడ: విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి ఘటనలో మరో ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారికి 41ఏ నోటీసులు జారీ చేశారు. తాజాగా నోటీసులు ఇచ్చిన వారిలో గుణదలకు చెందిన సంగపు చెన్నకేశవరావు, శిఖామణి సెంటర్‌కు చెందిన మేడిశెట్టి రాజశేఖర్‌, ఉడ్‌పేటకు చెందిన సొంగా చందన్‌, మొగల్రాజపురానికి చెందిన ఇల్ల సురేష్‌, క్రీస్తురాజపురానికి చెందిన శిఖ రంజిత్ కుమార్‌, దుర్గా అగ్రహారానికి చెందిన నామవరపు యశోద, కృష్ణలంకకు చెందిన ఎం.ఆదిలక్ష్మి ఉన్నట్టు డీసీపీ హర్షవర్దనరాజు తెలిపారు. ఈనెల 19న పట్టాభి ఇంటిపై దాడి జరగ్గా..  ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 18 మంది నిందితులను గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని