అలా.. సాధించాం..
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

అలా.. సాధించాం..

రాజమహేంద్రవరం (దానవాయిపేట), రావులపాలెం గ్రామీణం: న్యాయ విద్యలో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లాసెట్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ చూపారు. అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రస్థాయిలో 8, 9 ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు.

నలుగురికీ న్యాయం చేయాలని...

ఇది నా మొదటి విజయం. చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి నుంచి లా చదవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నా. నలుగురి న్యాయం కోసం పోరాడాలంటే ఈ వృత్తి ఒక్కటే మార్గం. పది పూర్తి కాగానే న్యాయ విద్యకు ఉపయుక్తంగా ఉండేలా ఇంటర్‌లో హెచ్‌ఈజీ విభాగాన్ని తీసుకుంటానని అమ్మ, నాన్నలతో చెప్ఫా వారు ఎంతో ప్రోత్సహించారు. తర్వాత క్లాట్‌లో శిక్షణ తీసుకున్నా. అందులో నాలుగు వేల ర్యాంకు వచ్చినా నిరాశ చెందలేదు. పట్టుదలతో రోజుకు ఎనిమిది గంటలకుపైగా చదివి లా సెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించగలిగా.- ఆరవ హర్షిత, ఎనిమిదో ర్యాంకర్‌, రాజమహేంద్రవరం

ప్రజలకు సేవలు అందించడానికే...

న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందించడానికి ఈ కోర్సు ఎంచుకున్నా. ఏలూరులోని సెయింట్‌ థెరిసా మహిళా కళాశాలలో ఇంటర్‌ చదివా. అయిదేళ్ల న్యాయవాద కోర్సును పూర్తిచేసి ప్రజలకు సేవ అందించడమే లక్ష్యం. - యార్లగడ్డ థెరిసా, తొమ్మిదో ర్యాంకర్‌, రావులపాలెం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని