‘పీజీఈసెట్‌’లో ఏఎన్‌యూ విద్యార్థినికి రెండో ర్యాంకు
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

‘పీజీఈసెట్‌’లో ఏఎన్‌యూ విద్యార్థినికి రెండో ర్యాంకు

చైతన్య

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: గురువారం విడుదలైన ‘పీజీఈసెట్‌’ ఫలితాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ చేసిన చైతన్య రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఎంఫార్మసీ తర్వాత ఏదైనా మంచి సంస్థలో ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని చెప్పింది. ఈ పరీక్షలో క్యాంపస్‌ ఫార్మసీ కళాశాల సత్తా చాటిందని, మరో ఐదుగురు వంద లోపు ర్యాంకులు సాధించారని ప్రిన్సిపల్‌ ఆచార్య ప్రమీలారాణి చెప్పారు. సుజని (12), మానస సౌజన్య (21), ప్రీతి (48), మానస (99), మణికిషోర్‌ (99) ప్రతిభ చాటారని, వీరిని వీసీ ఆచార్య రాజశేఖర్‌ అభినందించారని ఆమె పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని