మానసిక వేదనకు పరిహారం చెల్లించండి
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

మానసిక వేదనకు పరిహారం చెల్లించండి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కారు పత్రాలు ఆలస్యంగా అందించి వినియోగదారుడికి అసౌకర్యం కలిగించిన రెనాల్ట్‌ సంస్థకు జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 రూ.10వేల జరిమానా విధించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన డా.ఇ.వి.ప్రియనందన్‌ మానస నర్సింగ్‌హోమ్‌లో వైద్యులు. రెనాల్ట్‌ డస్టర్‌ కారును రూ.10వేలు వెచ్చించి బుక్‌ చేశారు. 2017 అక్టోబరు 23న కారును ఇస్తామని హిమాయత్‌నగర్‌ షోరూమ్‌ ప్రతినిధులు తెలపడంతో ఆన్‌లైన్‌లో రూ.14,87,926 చెల్లించారు. సర్వర్‌ సమస్యతో ఇన్‌వాయిస్‌, బీమా, ఆర్టీఏ తదితర పత్రాలు రాలేదని షోరూమ్‌ ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదుదారు విముఖత వ్యక్తం చేసినప్పటికీ ప్రతివాదులు ఒకే వాహనం అందుబాటులో ఉందని పట్టుబట్టి అదే రోజున కారు పంపించారు. నవంబర్‌ 9న కారు పత్రాలను అందించారు. ఆలస్యంగా పత్రాలు ఇవ్వడంతో రూ.63వేల నష్టం వాటిల్లిందంటూ ప్రియనందన్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. బుకింగ్‌ తేదీ, ఇన్‌వాయిస్‌, బీమా అందించిన తేదీల్లోనూ మార్పులు చేశారని సాక్ష్యాధారాలు సమర్పించారు. వాదనలు విన్న కమిషన్‌-3 ఫిర్యాదీదారు మానసిక వేదనకు పరిహారంగా రూ.10వేలు, కేసు ఖర్చుల కింద రూ.5వేలు, చెల్లించాలని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని