ప్రతిష్ఠాత్మకంగా జగనన్న కాలనీల నిర్మాణం
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

ప్రతిష్ఠాత్మకంగా జగనన్న కాలనీల నిర్మాణం

గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

మాట్లాడుతున్న గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. ఇళ్లనిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు సిమెంటు, ఇనుముతోపాటు రవాణా సౌకర్యం కల్పించే విధంగా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. సుమారు 40 కిలోమీటర్లకుపైగా దూరమున్న లేఅవుట్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోందని, 40 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరాకు రేవుల వద్ద కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న లేఅవుట్ల వద్ద ఇసుక యార్డులు ఏర్పాటు చేయనున్నామని, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. సమీక్షలో రాజంపేట, కమలాపురం, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, రమేష్‌యాదవ్‌, కడప మేయర్‌ సురేష్‌బాబు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ యానాదయ్య, సగర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రమణమ్మ, సంయుక్త కలెక్టర్లు గౌతమి, ధ్యానచంద్ర, సాయి కాంత్‌వర్మ, సబ్‌ కలెక్టర్లు పృథ్వీతేజ్‌, కేతన్‌గార్గ్‌, ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని