
భక్తల మధ్య సాగుతున్న స్వామి రథోత్సవం
పత్తికొండ గ్రామీణ, న్యూస్టుడే: హోసూరు సమీపంలోని నరసమ్మ తోటలో వెలసిన యోగి నరసింహస్వామి రథోత్సవం శనివారం కన్నుల పండువగా సాగింది. స్వామి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రథోత్సవం అనంతరం స్వామివారిని అర్చకులు ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.