డిపార్ట్‌మెంటల్‌ పరీక్షకు 135 మంది హాజరు
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షకు 135 మంది హాజరు

కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న జేడీ డా.రమేష్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామ పశుసంవర్ధక సహాయకులకు డిపార్ట్‌మెంటల్‌ ప్రొబేషనరీ కోసం ఆదివారం కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. 135 మంది హాజరయ్యారు. జిల్లా పశుసంవర్ధక సంయుక్త సంచాలకులు డా.ఎంబీ రమేష్‌, డీడీ డా.రమణయ్య, తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డా.వై రవీంద్రారెడ్డి, డా.సతీష్‌ పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించారు.

ఏపీ సహకార బ్యాంకు ఆధ్వర్యంలో..

ఏపీ సహకార బ్యాంకులో స్టాఫ్‌ అసిస్టెంట్లు, మేనేజర్‌ స్కేల్‌-1 పోస్టుల భర్తీకి ఆదివారం ఆన్‌లైన్‌ పరీక్ష జరిగింది. కర్నూలులో అయాన్‌ డిజిటల్‌, బిట్స్‌, కేవీ సుబ్బారెడ్డి, శ్రీనివాస, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలు, నంద్యాల ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. ఆప్కాబ్‌ డీజీఎం బాబురావు, ఏజీఎంలు శ్రీకాంత్‌, విజయకుమార్‌, సీనియర్‌ మేనేజర్‌ భరద్వాజ్‌, మేనేజర్లు ప్రియాంక, తేజ, జిల్లా డీసీసీబీ డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్‌, నాగిరెడ్డి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. మేనేజర్‌ స్కేల్‌-1 పరీక్షకు 739 మందికి గాను 582 మంది(78.75 శాతం) అభ్యర్థులు హాజరు కాగా, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పరీక్షకు 1465 మందికి గాను 1147 మంది (78.30 శాతం) హాజరయ్యారని ఆప్కాబ్‌ డీజీఎం బాబురావు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని