ఆసక్తి ఉంటే.. పంట పండుద్ది!
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

ఆసక్తి ఉంటే.. పంట పండుద్ది!

శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన శాఖ సిద్ధం

 

ఈనాడు - హైదరాబాద్‌: రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు అంటే సాధ్యమా అనిపిస్తుంది కదూ..! మనసుంటే సాధ్యమే అని ఉద్యాన శాఖ చెబుతోంది. ఇంటిపై.. చుట్టూ ఖాళీ ఉన్న ప్రదేశంలోనే.. రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు పండించుకోవడానికి సిద్ధమైతే.. శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ఈ నంబరుకు 97053 84384 ఫోను చేసి నమోదు చేసుకుంటే చాలు.. శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తామని అర్బన్‌ ఫార్మింగ్‌ ఏడీహెచ్‌ యాదగిరి వివరించారు.

కేవలం రూ. 100కే..

మిద్దెపై.. ఇంటి ఆవరణ లేదా బాల్కనీ లో ఎంత స్థలం అందుబాటులో ఉంది.. అన్ని వివరాలు చెబితే, అందుకు తగ్గట్టు కూరగాయల పంటల సాగు పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యానవన శాఖ శిక్షణ అధికారులు చెబుతారు. ఇందుకు చెల్లించాల్సింది కేవలం రూ.100. ప్రతి నెల రెండో శనివారం, నాలుగో ఆదివారం ఉదయం ఈ శిక్షణ ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలో మంచి ఫలితాలు సాధించిన వారితో కూడా తరగతులుంటాయి. రెడ్‌హిల్స్‌లో నాంపల్లి క్రిమినల్‌ కోర్టు సమీపంలోని ఉద్యాన వన శాఖకు చెందిన తెలంగాణ హార్టికల్చర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఈ శిక్షణ ఉంటుంది. మిద్దె తోటల పెంపకం ఎలా అనే పుస్తకం కూడా అందజేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని