close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం పరిశీలన

వీసీలో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి సత్యనారాయణ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ సముదాయాన్ని పాలనాధికారి సత్యనారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని విభాగాల్లో కలియదిరిగారు. నక్ష పరిశీలించి గుత్తేదారులకు, ఇంజినీర్లకు తగిన సూచనలు చేశారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ప్రత్యేకాధికారి వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ మహేందర్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

జనాభా లెక్కలకు సంసిద్ధం కావాలి

కామారెడ్డి కలెక్టరేట్‌: 2021 జనాభా లెక్కలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలని డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సెస్‌ ఆపరేషన్‌ ఇలంబర్తి సూచించారు. జనహిత భవన్‌లో ఏర్పాటు చేసిన వీసీలో ఆయన గురువారం జిల్లా పాలనాధికారి సత్యనారాయణతో మాట్లాడారు. 2021 జన గణనకు ఎన్యూమరేటర్లను గుర్తించాలని పేర్కొన్నారు. జనగణనకు నోడల్‌ అధికారుల నియామకం, శిక్షణ కార్యక్రమాలను డిసెంబరు నెలలో ప్రారంభించాలని, 150 ఇళ్లను ఒక బ్లాకుగా గుర్తించి జనాభా లెక్కించాలని తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి జనాభా లెక్కలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎన్యూమరేటర్లకు, శిక్షణ అధికార్లకు జనగణన మొబైల్‌ యాప్‌నకు రూ. 25వేలు, పేపర్‌ షెడ్యూల్‌కు రూ.17,500 పారితోషికం అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ప్రత్యేకాధికారి వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, సీపీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, జడ్పీ సీఈవో కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడులను మూసివేయొద్దు

కామారెడ్డి కలెక్టరేట్‌: ప్రభుత్వ బడులను మూసివేసే చర్యలను మానుకోవాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12వేల బడులను మూసివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, విద్యాహక్కు చట్టానికి సవరణలు చేయడాన్ని విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మణికంఠ, రవి, ఉమేశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.