close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఐ, కానిస్టేబుల్‌ వివాదంపై దర్యాప్తు

విచారణకు ఎస్పీ ఆదేశం

ప్రత్యేకాధికారిగా ట్రాఫిక్‌ డీఎస్పీ

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు శాఖలో చర్చకు దారి తీసిన సీఐ వర్సెస్‌ కానిస్టేబుల్‌ వ్యవహారంపై జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావును నియమించారు. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనానికి సంబంధించిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. రాపూరు పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌పై వేదాయపాళెం పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు దూషించారని, దాడి చేశారంటూ స్టేషన్‌లోనే నిరసనకు దిగారు. దీంతో ఈ విషయం చర్చకు దారి తీసింది. పోలీసు అధికారుల సంఘం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ఆరా తీశారు. ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు బుధవారం వేదాయపాలెం స్టేషన్‌కు వెళ్లి సిబ్బందిని విచారించారు. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీశారు.


పోలీసులతో అనుచితంగా ప్రవర్తిస్తే సహించం

ఆత్మకూరు ఘటనపై ఎస్పీ

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ప్రకటించారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై స్పందించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేస్తున్న ఎస్సై రోజాలతపై ఇద్దరు వాలంటీర్లు అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం తాగి దూషించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. దీంతో ఎస్పీ స్పందించారు. ఘటనకు కారణమైన కాకి కిరణ్‌, గంగాధర్‌రావులపైౖ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

శుభకార్యానికి వెళుతూ మృత్యుఒడికి..

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని మెడికవర్‌ ఆసుపత్రి వద్ద జరిగింది. బుజబుజనెల్లూరు వైఎస్సార్‌ నగర్‌లో ఉంటున్న సిద్ధవరపు హరిబాబు(50), జగదేవిపేటకు చెందిన చంద్రశేఖర్‌ స్నేహితులు. వీరిద్దరూ గురువారం చిత్తూరు జిల్లాలో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జగదేవిపేట నుంచి బయల్దేరిన ద్విచక్ర వాహనం మెడికవర్‌ ఆసుపత్రి వద్దకు రాగానే ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న హరిబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఎస్సై రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.