సోమవారం, డిసెంబర్ 09, 2019
నర్సంపేట: బాలల హక్కుల వారోత్సవాలను పురష్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేటలో గురువారం నిర్వహించిన వాకథాన్ కార్యక్రమాన్ని జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాలలు మన దేశ సంపద అని అన్నారు. వారి సంరక్షణ, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్, డీడబ్ల్యూవో చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డీసీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు