close
Published : 09/08/2021 06:34 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

చేపల మధ్య ఈత కొడితే...!

సినీనటి కియారా అడ్వాణీ పేరు తెలియని వారుండరేమో! తక్కువ చిత్రాలతోనే...తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ తార...తన ఫిట్‌నెస్‌ రహస్యాలను చెప్పుకొచ్చిందిలా.

అందంగా కనిపించడానికే కాదు... ఆరోగ్యంగా ఉండటానికీ ఫిట్‌నెస్‌ అవసరం. అలాగని ప్రతి రోజూ జిమ్‌లోనే గడిపేస్తానని అనుకోవద్దు. వారానికి నాలుగైదు రోజులు మాత్రమే వ్యాయామాలకు కేటాయిస్తా. అవి కూడా నిత్యం కొత్తగా ఉండేలా ఎంపిక చేసుకుంటా. స్క్వాట్స్‌, రన్నింగ్‌, బరువులెత్తడం వంటివాటితో పాటు డ్యాన్స్‌ కలిసే కసరత్తులను ఎంచుకుంటా. ఇవన్నీ ఉత్సాహాన్ని అందిస్తాయి. మిగతారోజుల్లో ఈత, కిక్‌ బాక్సింగ్‌ వంటివి సాధన చేస్తా. ముఖ్యంగా అండర్‌ సీ స్విమ్మింగ్‌ అంటే నాకెంతో ఇష్టం. నీళ్ల కింద రంగురంగుల చేపల మధ్య ఈదుతుంటే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఇవే కాదు..ఖాళీ దొరికితే ట్రెక్కింగ్‌ చేయడమూ ఇష్టమే. ఇవన్నీ నన్ను శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడంతోపాటు  మానసికానందాన్ని అందిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నామంటే అది మన అందాన్ని మరింత పెంచుతుంది. సంతోషం నిండిన ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందుకే ఆధునిక, సంప్రదాయ దుస్తులు ఏవి ధరించినా నాకు ఇట్టే నప్పుతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని