దసరా స్పెషల్‌: మరో 18 ప్రత్యేక రైళ్లు

తాజా వార్తలు

Published : 16/10/2020 02:11 IST

దసరా స్పెషల్‌: మరో 18 ప్రత్యేక రైళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. నిన్న కొన్ని రైళ్లను ప్రకటించగా.. గురువారం తాజాగా మరో 18 ప్రత్యేక రైళ్లతో జాబితాను విడుదల చేసింది. కాచిగూడ - మైసూర్‌- కాచిగూడ; హైదరాబాద్‌ - జైపూర్‌ - హైదరాబాద్‌; హైదరాబాద్‌ - రక్సాల్‌- హైదరాబాద్; విశాఖ- నిజాముద్దీన్‌; విశాఖ -విజయవాడ; విశాఖ - కడప; విశాఖ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ స్టేషన్ల మధ్య ఈ సర్వీసులను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 20 నుంచి నవంబరు 30 వరకు ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఆయా రైళ్ల ప్రయాణ వేళలు, అవి ఆగే స్టేషన్ల వివరాలను అధికారులు గురువారం ట్విటర్‌లో వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిచే అంశంపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లకు ప్రాధాన్యం మరింతగా పెరిగింది. కాచిగూడ- మైసూరు రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయి. అలాగే, హైదరాబాద్‌- జైపూర్‌ రైలు వారంలో రెండు రోజుల పాటు మాత్రమే సేవలందించనుండగా.. హైదరాబాద్‌- రక్సాల్‌ రైళ్లు వారంలో ఒకరోజు మాత్రమే తిరగనున్నాయి. ఆయా రైళ్లలో సెకెండ్‌ సిట్టింగ్‌, స్లీపర్‌ క్లాస్‌తో పాటు థర్డ్‌, సెకెండ్‌, ఫస్ట్‌ ఏసీ బోగీలు ఉండనున్నాయి.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని