రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు

తాజా వార్తలు

Published : 27/09/2020 14:41 IST

రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు

                                                                                                

న్యూదిల్లీ : దేశంలో రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. 110 చోట్ల నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ కిట్లు అన్ని రాష్ర్టాలకు కావల్సినన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. గతంలో పీపీఈ కిట్లు కొరత ఉందన్న రాష్ర్టాలే ప్రస్తుతం వాటిని నిల్వ చేయడానికి స్థలం లేదనే స్థాయికి చేరుకున్నాయని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏడు కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన ఆయన రికవరీ రేటు 82 శాతం ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1823 కొవిడ్‌ నిర్ధరణ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని