సెప్టెంబరు 1 నుంచి తెరుచుకోనున్న తాజ్‌మహల్

తాజా వార్తలు

Published : 20/08/2020 19:09 IST

సెప్టెంబరు 1 నుంచి తెరుచుకోనున్న తాజ్‌మహల్

ఆగ్రా: అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు పర్యాటకుల అనుమతి ఇవ్వనున్నారు. సెప్టెంబరు 1 నుంచి ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రా కోటను పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అందులో భాగంగా పురావస్తుశాఖ పరిధిలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసి ఉంచారు. కొద్ది నెలలుగా విడతల వారీగా కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జులై నుంచి కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పర్యాటక ప్రదేశాలు కూడా తిరిగి తెరిచేందుకు అనుమతించింది.

దీనిని అనుసరించి తాజాగా ఆగ్రా జిల్లా కలెక్టర్‌ పీఎన్‌ సింగ్ తాజ్‌మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిఖ్రీలను తొలి దశలో భాగంగా సందర్శకుల కోసం తెరిచేందుకు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే పర్యాటకులు మాత్రం తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. కొవిడ్-19 కరోనా కారణంగా పర్యాటక రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. సుమారు ఐదు నెలల తర్వాత ఎంతో ప్రాముఖ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకోనుండటంతో  ఆ ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకోవడంతో పాటు ఎంతో మందికి ఉపాధి లభించనుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని