close

తాజా వార్తలు

Published : 14/04/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ ఎఫెక్ట్‌: విశాఖ రైల్వేస్టేషన్‌లో మార్పులు

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌ వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రేపటి నుంచి రైల్వే స్టేషన్‌ లోపలికి వెళ్లే దారి.. బయటకు వచ్చే దారి వేర్వేరుగా ఉంటాయని అధికారులు తెలిపారు.  రైల్వే స్టేషన్‌కి వచ్చే ప్రయాణికులను జ్ఞానాపురం గేట్ వద్దనున్న ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫారం మీదుగా స్టేషన్ లోనికి అనుమతిస్తామని వివరించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే లోనికి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే వారికి ఒకటో ప్లాట్‌ఫారం నుంచి అనుమతి ఉంటుందన్నారు.

విశాఖ రైల్వే స్టేషన్‌లో ఎవరూ గుంపులుగా ఉండొద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలన్నారు. ఇప్పటికే ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్ షీట్ల సరఫరా లేదని.. కర్టెన్లు కూడా తొలగించామని చెప్పారు. కొవిడ్ వ్యాప్తిని ఆరికట్టేందుకు చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ ధరించడం లాంటివి తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అందులో విశాఖ జిల్లాలోనే 414 మందికి వైరస్‌ సోకగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు విశాఖలో మొత్తంగా 65,576 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 588 మంది వైరస్‌కు బలయ్యారు.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని