పీఏసీఎస్‌ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
close

తాజా వార్తలు

Published : 30/01/2020 19:58 IST

పీఏసీఎస్‌ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటీసు విడుదల చేసి.. అదే నెల 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని పీఏసీఎస్‌లకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. పీఏసీఎస్‌ల పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పదవీకాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని.. 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలింగ్‌ జరిగిన అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని