నా భర్త అమాయకుడు: అక్షయ్‌సింగ్‌ భార్య

తాజా వార్తలు

Updated : 19/03/2020 18:45 IST

నా భర్త అమాయకుడు: అక్షయ్‌సింగ్‌ భార్య

దిల్లీ: వివిధ కోర్టులలో తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందును ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రేపు ఉదయం 5:30 గంటలకు నిందితులు నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ తీర్పు వెలువరించిన వెంటనే కోర్టు బయట తన కుమారుడితోపాటు ఉన్న నిందితుడు అక్షయ్‌సింగ్‌కుమార్‌ భార్య పునీతాదేవి సొమ్మసిల్లిపడిపోయింది. అక్కడివారు, లాయర్లు సపర్యలు చేయడంతో కోలుకుంది. కొద్దిరోజుల క్రితం పునీతాదేవి తాను రేపిస్టుకు భార్యగా ఉండలేనంటూ అక్షయ్‌ నుంచి వెంటనే తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ బీహార్‌ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ..తన భర్త అమాయకుడని, అతనితో పాటు తనకు,  కుమారుడికి కూడా మరణశిక్ష విధించండంటూ బిగ్గరగా ఏడ్చింది. తనకు ఈ జీవితం వద్దంటూ చెప్పులతో తన చెంపలపై కొట్టుకుంది.  గత ఏడేళ్లుగా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తూ చస్తూబ్రతుకుతున్నామని విలపించింది. మరోపక్క నిర్భయ తల్లిదండ్రులు మాట్లాడుతూ..నిందితులు సమాజంలో ఒక భాగమన్నారు. చాలామంది అనుకోని ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అయితే ఇటువంటి నేరాలలో నిందితులు ఎంతమాత్రమూ క్షమార్హులు కాదన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని