TS News: మ‌హిళ‌కు ఒకేసారి రెండు డోసుల టీకా
close

తాజా వార్తలు

Published : 19/06/2021 13:07 IST

TS News: మ‌హిళ‌కు ఒకేసారి రెండు డోసుల టీకా

రంగారెడ్డి: ఓ మ‌హిళ‌కు ఒకేసారి రెండు డోసుల క‌రోనా టీకా వేసిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా పెద్దఅంబ‌ర్‌పేట్ జ‌డ్పీ హైస్కూల్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 17న ల‌క్ష్మీప్ర‌స‌న్న అనే మ‌హిళకు న‌ర్సు రెండు డోసులు వ్యాక్సిన్ వేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు లోకి వ‌చ్చింది. మొద‌టి డోసు వేసుకున్న మ‌హిళ‌ను గ‌మ‌నించని న‌ర్సు.. వేరే మ‌హిళ వ‌చ్చింద‌నుకొని రెండో డోసు కూడా వేసిన‌ట్లు తెలుస్తోంది. ల‌క్ష్మిప్ర‌స‌న్న‌ను వైద్య సిబ్బంది వ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు రోజుల ప‌రిశీల‌న అనంత‌రం ఈ ఉద‌యం ఆమెను డిశ్ఛార్జి చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని