Crime: విద్యార్థితో లెక్కల టీచర్‌ లైంగిక సంబంధం.. బెయిల్‌పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!

బ్రిటన్‌లో ఓ లెక్కల టీచర్‌ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.విద్యార్థులతో ఆమె సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి.  

Updated : 08 May 2024 13:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమె ఓ లెక్కల టీచర్‌.. బుద్ధిగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఆమె దారితప్పింది. తన వద్ద పాఠాలు నేర్చుకొంటున్న బాలురిపైనే కన్నేసింది. తనకంటే వయస్సులో చాలా చిన్నవాడైన ఒక విద్యార్థిని లొంగదీసుకొంది.  లైంగిక వాంఛలు తీర్చుకొంది. అది వివాదాస్పదమై కోర్టుకు చేరింది. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె మరో బాలుడిపై కన్నేసి అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది.. వీరి బంధం ముదిరి ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు అది బయటపడటంతో సదరు టీచర్‌ వ్యవహారం యూకేలో సంచలనంగా మారింది. 

బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్‌ (30) వ్యవహారం సంచలనంగా మారింది. 2021లో ఓ బాలుడికి లెక్కల్లో అదనపు తరగతులు తీసుకొంది. ఆ సమయంలో  11 అంకెల ఫోన్‌ నెంబర్లో ఒక్కటి తప్ప మిగిలినవి చెప్పింది. తన మొబైల్‌ నెంబర్‌ కనుక్కోవాలని ఛాలెంజ్‌ చేసింది. ఆ తరవాత వారిద్దరి మధ్య సందేశాలతో మొదలైన బంధం బలపడింది. ఒక రోజు ఆ బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లిన ఆమె.. 345 పౌండ్లు ఖరీదైన గూచీ బెల్ట్‌ కొనిచ్చింది.  సీసీటీవీలో ఈ దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని అతడు తన మిత్రుడికి చెప్పడంతో అది పోలీసులకు చేరింది. దీంతో జాయ్‌నెస్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. 

ఆ తర్వాత విచారణ సమయంలో జాయ్‌నెస్‌ మరో బాలుడికి దగ్గరైంది. స్నాప్‌ ఛాట్‌లో పరిచయమైన అతడికి తన ఫొటోలు పంపి మెల్లగా ముగ్గులోకి లాగింది. అతడితో కూడా కోర్కెలు తీర్చుకొని గర్భం దాల్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. మరోవైపు జాయ్‌నెస్‌ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని.. ఆ రెండో బాలుడికి 16 ఏళ్లు నిండిన తర్వాతనే సంబంధం పెట్టుకొన్నట్లు చెబుతోంది. బ్రిటన్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని