close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1056 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా జిల్లాలో మొదటి నిర్మాణాలు ప్రారంభం


ఇళ్లను పరిశీలిస్తున్న మంత్రులు కొడాలి నాని, పేర్నినాని

గుడివాడ, న్యూస్‌టుడే : అందరికీ ఇళ్లు పథకం కింద గుడివాడ మండలం మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో 22 బ్లాక్‌ల్లో నిర్మించనున్న 1056 ఇళ్ల నిర్మాణ పనులకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), రవాణా శాఖ మంత్రి పేర్నినాని బుధవారం శంకుస్థాపన చేశారు. చదరపు అడుగుకు రూ.400 మేర గతంతో పోలిస్తే తగ్గిందని మంత్రి కొడాలి పేర్కొన్నారు. టిడ్కో డీఈ ప్రసాద్‌ నిర్మాణంలో వినియోగించే సాంకేతికత, మెటీరియల్‌, యంత్రాల గురించి వివరించారు. ఎంజేఆర్‌ కనస్ట్రక్షన్స్‌ గుత్తేదారులు శివాజీ, బ్రహ్మాజీ, రత్నాజీ, వైకాపా రాష్ట్రనేత దుక్కిపాటి శశిభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ దోపిడి

రాష్ట్రంలో పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లలోనూ దోపిడి చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. గృహనిర్మాణ సముదాయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 1056 ఇళ్ల నిర్మాణంలో రూ.16 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగామని తెలిపారు. రాష్ట్రంలోని టిడ్కో గృహనిర్మాణాల ద్వారా రూ.2 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.