ప్రధానాంశాలు

Published : 26/04/2021 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తేలిపోయిన పంజాబ్‌.. కోల్‌కతా లక్ష్యం 124

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (31; 34 బంతుల్లో 1x4, 2x6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ భారీ స్కోర్‌ సాధించే దిశగా ఆడలేకపోయింది. ఈ క్రమంలోనే చివర్లో జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1x4, 3x6) ధాటిగా ఆడడంతో జట్టు స్కోర్‌ 100 పరుగులైనా దాటగలిగింది. లేకపోతే ఆ మాత్రం స్కోర్‌ కూడా వచ్చేది కాదు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్‌ 3, నరైన్‌, కమిన్స్‌ 2 వికెట్లు తీయగా శివమ్‌ మావి, చక్రవర్తి చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net