close

తాజా వార్తలు

Updated : 30/11/2020 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కరోనా @381

అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 381 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,728 శాంపిల్స్‌ పరీక్షించగా.. 381 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా 934మంది కోలుకోగా.. మరో నలుగురు (అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన వాటితో కలుపుకొంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కోటికి పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 8,68,064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,992మంది ప్రాణాలు కోల్పోగా..  8,53,232 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,840 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఏపీలో కరోనా పరిస్థితి (జిల్లాల వారీగా..)


 

 


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని