
తాజా వార్తలు
నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి: చిరు
రాజశేఖర్ ఆరోగ్యం గురించి చిరంజీవి ట్వీట్
హైదరాబాద్: నటుడు రాజశేఖర్ కొవిడ్ నుంచి వేగంగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మిక చేసిన ట్వీట్‌పై చిరు స్పందించారు. ఈ మేరకు ఆయన రాజశేఖర్ కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు. ‘శివాత్మిక.. నువ్వు ఎంతగానో ప్రేమించే నీ తండ్రి, నా సహనటుడు, స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలు ఆయనతోపాటు ఆయన కుటుంబంలో ధైర్యం నింపాలి’ అని చిరు ట్వీట్ చేశారు.
తన కుటుంబమంతా కొవిడ్-19 బారిన పడిందని ఇటీవల రాజశేఖర్ సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. ఈ తరుణంలోనే తాజాగా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక.. ఆయన ఆరోగ్యంపై పలు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరు వదంతులు వ్యాప్తిచేయవద్దని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా రాజశేఖర్ ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు.