close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 10/07/2020 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో వికాస్‌దూబే హతం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌దూబే పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నిన్న ఉజ్జయినిలో పోలీసులకు చిక్కిన వికాస్‌ను ఇవాళ ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు యూపీ నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తాపడింది. ఆ సమయంలో వికాస్‌దూబే పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొలువులకు కోత

రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. గత అయిదేళ్లలో దాదాపు 22 వేల మంది అధ్యాపకుల  కొలువులకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సీట్ల సంఖ్య తగ్గడం, యాజమాన్యాలు కళాశాలలను మూసేసుకోవడంతో పాటు విద్యార్థులు- అధ్యాపకుల నిష్పత్తిలో ఏఐసీటీఈ మార్పు చేయడం తదితర అంశాలు అధ్యాపకుల సంఖ్య తగ్గడానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాఠాల బాట ఎలా?

3. బస్తీ దవాఖానాల్లోనూ పరీక్షలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి 167 బస్తీ దవాఖానాల్లోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 90 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా.. వీటి పరిధిని మరింతగా విస్తరించారు. నగర పరిధిలో మొత్తంగా 300 వైద్యశాలల్లో ఈ పరీక్షలను అందుబాటులోకి తెస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇప్పుడప్పుడే ముగిసేది కాదిది

కరోనాతో పోరాటం ఇప్పుడప్పుడే ముగిసేది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇదో సుదీర్ఘ పోరాటమని పేర్కొన్నారు. గురువారం దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. కరోనా నియంత్రణలో ఉత్తర్‌ ప్రదేశ్‌ మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు. ‘‘వందేళ్ల క్రితం ఇలాంటి భయానక మహమ్మారే వచ్చింది. అప్పుడు మన జనాభా తక్కువ. అయినా కోట్లాది మంది మరణించారు. ఇప్పుడు జనసంఖ్య భారీగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ పాపం ఎవరిది?

అమ్మతనమంటే ఎంత ఆనందం? గర్భధారణ మొదలు ఆశల రూపం బయటికొచ్చేదాకా ఎన్నో కలలు... అందరిలానే ఆ తల్లీ కలలు కన్నది. కానీ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఆ కలల్ని చిదిమేసింది. పురిటి నొప్పులతో నగరానికి వచ్చిన గర్భిణికి తీరని శోకం మిగిలింది. కరోనా భయంతో, పడకలు లేవనే సాకుతో పలు ఆసుపత్రులు చికిత్సకు నిరాకరించాయి. రెండు రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ అంబులెన్సులో తిరిగి నరకం అనుభవించింది. దీంతో తల్లి అనారోగ్యం పాలు కాగా, శిశువు కడుపులోనే కన్నుమూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనాలోని భారత వైద్య విద్యార్థులకు షాక్‌!

చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులు భారతదేశంలో ‘హౌస్‌ సర్జన్‌ (హౌస్‌ సర్జెన్సీ)’ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే ‘ఎఫ్‌ఎంజీఈ’ (ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌) రాసే అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది. కేంద్రం అర్ధంతరంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల వారూ ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.మనోధైర్యమే మందు

కరోనా.. కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఎక్కడో చైనాలో మొదలై.. చూస్తుండగానే మన ఊరు, మన గుమ్మంలోకి కూడా వచ్చేసింది. కరోనా పేరు చెబితేనే కొందరు హడలిపోతున్నారు. జ్వరమో, దగ్గో వస్తే చాలు.. బెంబేలెత్తుతున్నారు. ఆ భయంతో గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచిన ఘటనలూ అక్కడక్కడ జరిగాయి. నిజంగా కరోనా అంటే అంత భయపడాలా? ఆ వ్యాధి సోకిందని తెలిస్తే అంతా అయిపోయిందని ఆందోళన చెందాలా? అవసరం లేదనే చెబుతున్నారు.. కొందరు విజేతలు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సామాజిక వ్యాప్తి లేదు

8.​​​​​​​ తొట్టిలో పెట్టి.. ఊరవతలికి నెట్టి..

ఏమైపోతోంది మానవత? ఎక్కడ పోతున్నాయి జాలీ..కరుణ?మరీ ఇంత అన్యాయమా? అని అందరూ అనుకునే ఉదంతమిది. అసలే పండు ముదుసలి. ఆపై వర్షం. అలాంటి స్థితిలో ఆమెకు నీడ చూపించాల్సింది పోయి. పొక్లెయిన్‌ తొట్టిలో తీసుకెళ్లి ఊరికి దూరంగా వదిలేశారు. అనాథ వృద్ధురాలి పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరించిన వైనం నాగర్‌కర్నూలు    జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వనపర్తి    జిల్లా పాన్‌గల్‌ మండలానికి చెందిన లక్ష్మమ్మ(70)కు ఎవరూ లేరు. వయసు మీదపడటం, చేతకాని స్థితికి చేరటంతో పక్క మండల కేంద్రమైన పెద్దకొత్తపల్లికి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.​​​​​​​ మండిపోతున్న రెమిడెసివిర్‌ ధర!

కొవిడ్‌-19కు అత్యవసర చికిత్స సాధనంగా ఇటీవలే అనుమతి పొందిన రెమిడెసివిర్‌ ఔషధం దురాశపరులైన ఔషధ దుకాణ యజమానులకు, డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రాణాపాయంలో ఉన్న కరోనా బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈ మందు రేటును అనేక రెట్లు పెంచి, జనాన్ని దారుణంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా దిల్లీలో ఔషధ దుకాణాల నుంచి విచ్చలవిడిగా నల్లబజారుకు తరలిపోతోంది. రోజురోజుకూ దీని ధర పెరిగిపోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.​​​​​​​ ప్రైవేటు రైలు.. ఎవరికి మేలు

భారతీయ రైల్వే తన చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు కంపెనీలకు తలుపులు తెరచింది. 109 జతల మార్గాల్లో 151 ఆధునిక రైళ్ల కార్యకలాపాలకు ప్రైవేటు కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నదే అయినా.. కార్యరూపానికి బిడ్ల ఆహ్వానం ద్వారా తొలి అడుగు పడింది. ఇది రైల్వేస్‌కు, ప్రైవేటు కంపెనీలకు, ప్రజలకు ఎంత మేలు చేస్తుందన్నదే ఇపుడు రైలు కూతంత గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.