
తాజా వార్తలు
మావోయిస్టుల కన్నా భాజపా డేంజర్: దీదీ
పురూలియా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టుల కన్నా భాజపా అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి ఆదివాసీలను తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. పురూలియా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో దీదీ మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరాలనుకునే నేతలు వెళ్లిపోవచ్చన్నారు. ఎంతమంది నేతలు తమ పార్టీని వీడినా భాజపాకు తల వంచేదిలేదని తేల్చి చెప్పారు. జంగల్ మహల్ ప్రాంతంలో తప్పుడు హామీలతో భాజపా నేతలు ఆదివాసీలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచాక వాళ్లు అసలు ఈ ప్రాంతానికే రాలేదని విమర్శించారు.
ఇదీ చదవండి..
Tags :