close

తాజా వార్తలు

Published : 14/07/2020 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణంగా ప్రేమించి... ప్రాణాలే అర్పించి...

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

అడివివరం, న్యూస్‌టుడే : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా పండంటి బిడ్డ కూడా జన్మించాడు. ప్రసవానంతరం భార్య మరణించింది. ఆ వేదనను తట్టుకోలేక భర్త కూడా లోకం విడిచి వెళ్లిపోయాడు. రోజుల బిడ్డ అనాథగా మారాడు. విశాఖ సింహాచలం కొండపైన గిరిజన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింహగిరి గిరిజన గ్రామానికి చెందిన జలుమూరి శ్రావణ్‌కుమార్‌ (20), పొరిగింట్లో ఉండే అంబిక ప్రేమించుకుని ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారు. అంబిక గర్భం దాల్చింది. ఈనెల 6న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. ఫిట్స్‌ రావడంతో సిజేరియన్‌ చేయగా మగబిడ్డను ప్రసవించింది. 8వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. అప్పటి నుంచి శ్రావణ్‌కుమార్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయిదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో చిన్నారి అనాథగా మారాడు. శ్రావణ్‌కుమార్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని