
తాజా వార్తలు
వెలువడుతున్న తొలి రౌండ్ పలితాలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ ముగిసే సరికి మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెల్లడైంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థి మజీద్ హుస్సేన్ గెలుపొందారు. శేరిలింగంపల్లి డివిజన్, బాలాజీనగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, సనత్‌నగర్, రంగారెడ్డినగర్, భారతీనగర్‌లో తొలిరౌండ్లో తెరాస ఆధిక్యంలో ఉంది. వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడెం, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలో తొలిరౌండ్లో భాజపా ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
వివేకానందనగర్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ బాక్సులో అధికంగా ఓట్లు ఉన్నాయని భాజపా ఏజెంట్ ఏకాంత్‌గౌడ్ ఆరోపించారు. బ్యాలెట్ బాక్సు సీలు సక్రమంగా లేదంటూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.
మౌలాలి డివిజన్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఓ బ్యాలెట్ బాక్సులో 33 ఓట్లు అధికంగా ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు పోలవ్వగా.. బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్‌ను నిలిపివేశారు. ఈ అంశాన్ని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
