close

తాజా వార్తలు

Updated : 01/12/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓల్డ్‌ మలక్‌పేటలో ఎల్లుండి రీ పోలింగ్‌

హైదరాబాద్‌: ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్‌ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్‌ మలక్‌పేటలోని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌‌ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ పరిధిలోని 69 పోలింగ్‌ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. 3వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల కు రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. రీ పోలింగ్‌లో ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్‌ ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు 3వ తేదీ సాయంత్రం 6గంటల వరకు నిషేధించారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని