ఏడాదిగా జాగ్రత్తగా ఉన్నా.. నేడు కరోనాకు చిక్కా! 

తాజా వార్తలు

Updated : 09/04/2021 17:28 IST

ఏడాదిగా జాగ్రత్తగా ఉన్నా.. నేడు కరోనాకు చిక్కా! 

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ చెత్త వైరస్‌ను తప్పించుకునేందుకు ఏడాది కాలంగా నా వంతు కృషి చేశా. ఎంతో జాగ్రత్తగా ఉన్నా. కానీ చివరకు వైరస్‌ నన్ను పట్టేసుకుంది. నేడు నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేవు. అయితే వైద్యుల సూచన మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నా’’ అని ట్వీట్ చేశారు. 

రెండు రోజుల క్రితమే ఒమర్‌ కరోనా టీకా తీసుకున్నారు. ఏప్రిల్‌ 7న శ్రీనగర్‌లోని స్కిమ్స్‌ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న ఆయన, ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఒమర్‌ తండ్రి, లోక్‌సభ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా కూడా ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. మార్చి 30న ఫరూక్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే స్వల్ప లక్షణాలు కన్పించడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని