Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179678
            [news_title_telugu_html] => 

9వ తరగతి నుంచి ‘కృత్రిమ మేధ’

[news_title_telugu] => 9వ తరగతి నుంచి ‘కృత్రిమ మేధ’ [news_title_english] => [news_short_description] => మారుతున్న సాంకేతిక పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచి కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ‘కృత్రిమ మేధను’ ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేస్తోంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
9వ తరగతి నుంచి ‘కృత్రిమ మేధ’ - EENADU
close
9వ తరగతి నుంచి ‘కృత్రిమ మేధ’

ఈ ఏడాది నుంచే సీబీఎస్‌ఈ ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు
పదో తరగతి గణితంలోనూ 2 రకాల ప్రశ్నపత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న సాంకేతిక పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచి కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ‘కృత్రిమ మేధను’ ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేస్తోంది. యోగా, శిశు విద్య అనే వాటిని కూడా ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. తొమ్మిదో తరగతిలో ‘కృత్రిమ మేథ’ను తీసుకుంటే పదో తరగతిలో కూడా దాన్నే ఎంచుకోవాలి. తప్పనిసరి సబ్జెక్టులు అయిదు ఉంటాయి. ఆరో సబ్జెక్టుగా ఒక ఐచ్ఛిక సబ్జెక్టును తీసుకుంటారు.
*  గణితం అంటే భయపడేవారికి ఊరటనిస్తూ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో రెండు రకాల గణితం ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. గణితం అంటే ఆసక్తి లేనివారు, పదో తరగతి తర్వాత గణితం సబ్జెక్టు లేని విద్యను చదువుకోవాలనుకున్న వారు సులభంగా ఉండే (బేసిక్‌ లెవెల్‌) ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. మిగిలిన వారు ప్రామాణిక ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు.
*  వార్షిక పరీక్షలో బేసిక్‌ స్థాయి పరీక్ష రాసి.. మళ్లీ ప్రామాణిక స్థాయి రాయాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావొచ్చు. ఒకవేళ ప్రామాణిక స్థాయి పరీక్షలో తప్పిన వారు.. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రాథమిక స్థాయి పరీక్ష రాసి ఇంటర్‌ విద్యలోకి ప్రవేశించవచ్చు. అయితే వారు గణితం సబ్జెక్టు ఉన్న గ్రూపులో చేరటం కుదరదు.
*  పదో తరగతి గణితం సిలబస్‌ అందరికీ ఒకటే.. తరగతి గదిలో ఒకేలా బోధిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న దాన్ని బట్టి ప్రశ్నపత్రాన్ని ఇస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.