close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్‌లు

36 వేలు దాటిన కేసులు
మరో 9 మరణాలు
ఒక్కరోజులో అత్యధిక పరీక్షలు

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం కొత్తగా 1550 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 36,221కి పెరిగింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 926 నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా 212, కరీంనగర్‌ 86, మేడ్చల్‌ 53, నల్గొండ 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్‌ నగరం 16, మహబూబాబాద్‌ 13, మహబూబ్‌నగర్‌ 13, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో పదేసి చొప్పున కేసులు నిర్ధారించారు. సోమవారం నాటి ఫలితాల్లో రాష్ట్రంలోని 29 జిల్లాల్లో కొవిడ్‌ కేసులను గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసొలేషన్‌లో 12,178 మంది చికిత్స పొందుతుండగా, తాజాగా మరో 1197 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరో 9 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 11,525 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఒక్క రోజులో పరీక్షించిన నమూనాల్లో ఇదే అత్యధికం. దీంతో పరీక్షల సంఖ్య 1,81,849కి పెరిగింది. ఇందులో 1,45,628 మందిలో కరోనా లేదని తేలింది. సోమవారం నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,081 కొవిడ్‌ పడకల్లో 1,844 నిండాయి. 15,237 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో మొత్తం 1890 పడకల్లో 877 మంది చికిత్స పొందుతుండగా.. 1013 పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

ఈఎస్‌ఐలో సభ్యత్వం లేని వారికీ వైద్య పరీక్షలు చేయించాలి: గవర్నర్‌
తెలంగాణలోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో దాని సభ్యత్వం లేని వారికి కరోనా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి అనుమతించాలని గవర్నర్‌ తమిళిసై కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌కు సోమవారం ట్విటర్‌లో వినతి చేశారు. తన వినతి మేరకు సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ వైద్యకళాశాల ఆసుపత్రిలో రోజుకు మూడు వేల మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసే శీఘ్ర (రాపిడ్‌) రోగ నిర్ధారణ యంత్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి అంగీకరించారని గవర్నర్‌ వెల్లడించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.