కొత్తగా 5 నగర పంచాయతీలు, ఒక పురపాలక సంఘం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తగా 5 నగర పంచాయతీలు, ఒక పురపాలక సంఘం

2 నగరపాలక, 13 పురపాలక సంఘాల్లో 95 పంచాయతీల విలీనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా అయిదు నగర పంచాయతీలను, ఒక పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోని తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలను కలిపి కొత్తగా వైఎస్‌ఆర్‌ తాడిగడప పురపాలక సంఘంగా పేరు పెట్టారు. ఈ ప్రథమ శ్రేణి మున్సిపాలిటీలో 38 వార్డులు ఉంటాయి. అదే సమయంలో రెండు నగరపాలక సంస్థలు, 13 పురపాలక సంఘాలలో 95 గ్రామ పంచాయతీలు, గ్రామాలను విలీనం చేశారు. సంబంధిత ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జారీచేశారు.
రెండు కార్పొరేషన్లలో 17 పంచాయతీలు...
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల పరిధిలో కొత్తగా చుట్టూ ఉన్న 17 పంచాయతీలను విలీనం చేశారు. శ్రీకాకుళం పరిధిలో ఏడు (పెద్దపాడు, పాత్రునివలస, ఖాజీపేట, చాపారం, కిల్లిపాలెం, తోటపాలెం, కుశాలపురం) పంచాయతీలను, రాజమహేంద్రవరంలో పది (శాటిలైట్‌ సిటీ, కతేరు, హుకుంపేట, బొమ్మూరు, ధవళేశ్వరం, పిడింగొయ్యి, రాజవోలు, తొర్రేడు, వెంకటనగరం, వేమగిరి) పంచాయతీలను చేర్చారు.
పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, తాడేపల్లి, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, కందుకూరు, గూడూరు (నెల్లూరు జిల్లా), శ్రీకాళహస్తి, గుడివాడ పురపాలక సంఘాల పరిధిలోకి వాటి సమీపంలోని 78 గ్రామ పంచాయతీలు, గ్రామాలను విలీనం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు