close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాగర్‌లో కలకలం

ఒక్కరోజే 174 మందికి వైరస్‌
క్వారంటైన్‌లో ప్రధాన పార్టీ అభ్యర్థి

ఈనాడు డిజిటల్‌, నల్గొండ, గుర్రంపోడు, న్యూస్‌టుడే: ఇటీవల నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కరోనా కల్లోలాన్ని రాజేసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పక్షం రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఎక్కువగా ప్రచార వాహనాల ద్వారానే స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. శనివారం పోలింగ్‌ పూర్తి కాగానే అనుమానం ఉన్న నాయకులంతా పరీక్షలు చేయించుకున్నారు. నియోజకవర్గంలో సోమవారం ఒక్కరోజే 174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
అధికార తెరాస అభ్యర్థి నోముల భగత్‌ తల్లి కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ముందుజాగ్రత్తగా ఆయన హోం క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. వ్యక్తిగత సహాయకులు, అంగరక్షకులు కూడా క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ దిగువ శ్రేణి నాయకులంతా పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. పోలింగ్‌ దృష్ట్యా నియోజకవర్గంలో ఈ నెల 17, 18 తేదీల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. తిరుమలగిరి సాగర్‌ మండలంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన నలుగురు నాయకులకు వైరస్‌ సోకింది. హాలియాలో ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడితోపాటు ఇంకో ఇద్దరు పార్టీ నాయకులకు పాజిటివ్‌ వచ్చింది. నిడమనూరులోనూ స్థానిక ప్రజాప్రతినిధి కొవిడ్‌ బారిన పడటంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు