close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్తగా 6,876 కొవిడ్‌ కేసులు

59 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 6,876 కొవిడ్‌ కేసులు (ఇప్పటివరకూ మొత్తం 4,63,361) నమోదయ్యాయి. మహమ్మారి కోరల్లో చిక్కుకొని 59 మంది (మొత్తం 2,476 మంది) మృత్యువాతపడ్డారు. తాజాగా 7,432 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా ఈ వ్యాధి నుంచి బయటపడిన వారి సంఖ్య 3,81,365కు చేరింది. ఈ నెల 3వ తేదీ(సోమవారం) రాత్రి 8 గంటలవరకూ నమోదైన కొవిడ్‌ సమాచారం ఇది. రాష్ట్రంలో ప్రస్తుతం 79,520 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 70,961 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,31,89,817కు పెరిగింది. మరో 3,864 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.
41,040 డోసుల పంపిణీ
రాష్ట్రంలో సోమవారం 603 ప్రభుత్వ పంపిణీ కేంద్రాల్లో 41,040 కొవిడ్‌ టీకా డోసులను వైద్యఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. దీంతో ఇప్పటివరకూ 41,77,399 మంది తొలి డోసు, 6,37,385 మంది రెండో డోసు టీకాను వేయించుకున్నారు. టీకాల వృథా 0.97 శాతంగా నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

ఏపీలో 20,034 మందికి వైరస్‌
మరో 82 మంది మృతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి కొవిడ్‌ నిర్ధారణైంది. కడప మినహా మిగతా 12 జిల్లాల పరిధిలో 82 మంది కొవిడ్‌తో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 11,84,028, మరణాలు 8,289కు చేరాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు