వాతావరణ మార్పులపై పోరాడాలి: మోదీ

తాజా వార్తలు

Published : 22/11/2020 22:29 IST

వాతావరణ మార్పులపై పోరాడాలి: మోదీ

దిల్లీ: వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు సమగ్రమైన రీతిలో పోరాడాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు జీ20 ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సేఫ్‌గార్డింగ్‌ ప్లానెట్‌’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘కొవిడ్‌-19 మహమ్మారి నుంచి పౌరుల్ని, ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో.. వాతావరణ మార్పులపై పోరాటానికి సైతం అంతే ప్రాధాన్యం ఇస్తోంది. భూగ్రహాన్ని రక్షించుకోవడానికి వాతావరణ మార్పులపై నామమాత్రంగా కాకుండా సమగ్రమైన మార్గంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారత్‌ స్థితిస్థాపక అభివృద్ధి పద్ధతులు పాటిస్తోంది. కార్బన్‌ తక్కువ స్థాయిలో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.  భారత్‌ పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాదు.. వాటిని మించిపోయింది. 2022 సంవత్సరానికల్లా 175గిగావాట్ల రెన్యూవబుల్‌ విద్యుత్‌ ఉత్పాదకతను లక్ష్యంగా పెట్టుకుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంగా ఉంటే ప్రపంచం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతుంది’ అని మోదీ ప్రసంగంలో వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని