close

తాజా వార్తలు

Published : 28/11/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

J&Kలో ప్రశాంతంగా ముగిసిన డీడీసీ పోలింగ్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయతీ ఉప ఎన్నికలకు తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఎనిమిది దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో శనివారం తొలి విడత ఓటింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. 

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 145 కంపెనీ కేంద్ర సాయుధ బలగాలు మోహరించి ఎన్నికలను పర్యవేక్షించాయి. తొలి విడతలో మొత్తం 296 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,146 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే వాతావరణం చలిగా ఉండటంతో తొలి గంటల్లో పోలింగ్‌ కాస్త ఆలస్యమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.69శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా సాంబాలో 59శాతం ఓటింగ్‌ నమోదైంది. 

జమ్మూకశ్మీర్‌లో మొత్తం 280 డీడీసీ స్థానాలున్నాయి. తొలి విడతలో 280 సీట్లకు పోలింగ్‌ జరిగింది. డిసెంబరు 19 వరకు మొత్తం 8 విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 22న ఫలితాలు వెలువడనున్నాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని